ముళ్ల పోదల్లో చిన్నారి

మెట్‌పల్లి : నెలలు నిండని పసిపాపను ముళ్ల పోదల్లో కర్కశంగా పడేసిన సంఘటన మెట్‌పల్లి మండలంలో జరిగింది. సట్టణంలోని గాజులపేటలో ఉదయం చెట్ల పోదల్లోంచి ఓ పసిపాప ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వారు గమనించి అపాపను బయటకు తీశారు. ముళ్లపోదల్లో గాయాలతో ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం అదే వీధికి చెందిన సంతానం లేని బింగి పరందాం భారతి దంపతులు తాము పెంచుకుంటామని పసిపాపను అక్కున చేర్చుకున్నారు. పోలిసులు సంఘటనా స్థలానికి పరిశీలించి పాప విషయాన్నిఅరా తీశారు.