‘ముస్లింలకు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ఇవ్వాలి’

హైదరాబాద్‌: ముస్లిం మైనారిటీలకు వచ్చే బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోతే ఆందోళన చేస్తమని హెచ్చరించారు. తమ పార్టీ ముస్లిం మైనారీటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.