ముస్లింలు విద్యావంతులైనప్పుడే వారి అభివృద్ధి సాధ్యం

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముస్లింలు విద్యావంతులైనపుడే వారి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆమె ముఖ్య అతిథిóగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్షరాస్యతలో ముస్లింలు వెనుకబడి ఉన్నారని అక్షరాస్యతలో అభివృద్ధి సాధించినపుడే వారు అభివృద్ధిపథంలోకి వెళ్తారని ఆమె తెలిపారు. మంచి విద్యాబుద్ధులు, సంస్కా రాన్ని పిల్లలకు అందించినపుడే సమాజంలో అనిశ్చితులు తొలగించడానికి ఉపయోగ పడుతాయన్నారు. జిల్లా ఎస్పీ రవీందర్‌ మాట్లాడుతూ సమాజంలో హిందూ ముస్లింల సహజీవనానికి ఇఫ్తార్‌ విందులు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వంలనే ఇస్లాం ప్రబోధిస్తుందని ఆయన తెలిపారు. ఈ సంద ర్భంగా ప్రవక్త ఖురాన్‌ ప్రవచనాలను పఠించారు. ఈ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మైనార్టీ శాఖ ఎక్జ్‌క్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంఏ హమీద్‌, మౌలానా బర్కతుల్లా, మౌలానా ముఫ్తీ నజీర్‌, లెక్చరర్‌ రహమాన్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బస్‌ షమీ, మత పెద్దలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.