మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలి

share on facebook

రైతు ఐక్యవేదిక సంఘం నేతల డిమాండ్‌
నిజామబాద్‌,మార్చి8(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో మూతపడిన మూడు షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను ఆదుకుంటామని హావిూలు ఇచ్చి మరిచారని రైతు ఐక్యవేదిక సంఘం నాయకులు అన్నారు. ఇప్పటికీ ఆ ఊసే ఎత్త డం లేదని ఆరోపించారు. హావిూలు నీటి మూటలు గానే మిగిలి పోతున్నాయని పేర్కొన్నారు. ముత్యంపేట్‌, సారంగపూర్‌, బోదన్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపిస్తామని తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేశారు.కేవలం ఓట్ల కోసమే రైతులను వాడుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే ప్రతీ ఒక్కరూ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతారన్నారు. రూ.100కోట్ల ఒక్కో షుగర్‌ఫ్యాక్టరీకి కేటాయించాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే పసుపు పండిరచే రైతుకు మేలు జరుగుతుందని ఐక్యవేదిక సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. పసుపుకు మధ్దతు ధరతోపాటు రూ.15వేలు క్వింటాలుకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఓట్ల సమ యంలోనే రైతులను గుర్తించి, మోసపూరిత వాగ్దానాలు చెప్పి వారి ఓట్లతో గెలిచి వారిని ఐదేళ్లుగా పట్టించుకోరని ఆవేదన వ్యక్తంచేశారు.

Other News

Comments are closed.