మృతుని కుటుంబానికి బీమా సహాయం

పవర్‌హౌస్‌కాలనీ, మే 26, (జనంసాక్షి): ఇటీవల అనారోగ్యం కారణంగా మృతిచెందిన తన్నీరు శ్రీనివాస్‌ భార్య శ్యామలకు అభయజీవన్‌ ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ రూ.లక్షను రమేష్‌నగర్‌కు చెందిన ఆంధ్రాబ్యాంకు బ్రాంచి ఇండియా ఫస్ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం అందచేసింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ ఎల్‌వి.రమణారావు, సిబ్బంది, ఇండియా ఫస్ట్‌ ఇన్సూరెన్స్‌ బిడిఎం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.