మృతుల కుటుంబాలను పరామర్శించిన ఒబామా

న్యూటౌన్‌: అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూటైన్‌ శాండీహుక్‌ పాఠశాల కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలను అధ్యక్షుడు ఒబామా పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇలాంటివాటిని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధితులు ఒంటరి వారు కాదని..వ ఆరి వెంట జాతి మొత్తం ఉందని భరోసా ఇచ్చారు. శాండీహుక్‌ పాఠశాలలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 20 మంది చిన్నారులతో సహా 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.