మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి
పెన్ పహాడ్. ఫిబ్రవరి 28 (జనం సాక్షి) : పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామం మాజీ ఎంపీటీసీ భర్త పుట్ట శ్రీనివాస్ గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతు గురువారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లోచికిత్స పొందుతూ మృతి చెందగా ఆయన నివాసంలో అనంతారం గ్రామంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పులా మాల లు వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది అని అన్నారు మండలంలోని పొట్లపహాడ్ గ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ హిమాకర్ రెడ్డి తండ్రి మరణించడంతో, అదే గ్రామంలో ఎంపీటీసీ మేకపోతుల సైదమ్మ తల్లి మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, సింగిల్ విండో చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి. నాతల జానకి రాంరెడ్డి.సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. జిల్లా బిఆర్ఎస్ నాయకులు మామిడి అంజయ్య ఎంపీటీసీ మామిడి రేవతి పరందములు. , దంతాల వెంకటేశ్వర్లు. పొదిలా నాగార్జున. బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ల నాగార్జున .చిటేపు నారాయణరెడ్డి.పొంతటి మల్లారెడ్డి. పొట్లపహాడ్ సర్పంచ్ రామినేని పుష్పావతి కృష్ణయ్య, సీతారాములు, ముదిరెడ్డి రంగారెడ్డి, నగేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు …