మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎన్రిక్‌ బాధ్యతలు

మెక్సికో సిటీ: మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎన్రిక్‌ పెనా నీటో బాధ్యతలు చేపట్టారు. దేశంలో శాంతి స్థాపనకు కృషి చేస్తానని, ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తానని, ఆయన ఈ సందర్భంగా హామి ఇచ్చారు. ఎన్రిక్‌ ఆరేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకారం సందర్భంగా వందాలాది నిరసనకారులు రోడ్లమీదికి వచ్చి ఆందోళనకు దిగారు.