మెట్రో వంతెన కూలి ఇద్దరికి గాయాలు

ముంబయి: నిర్మాణంలో ఉన్న మెట్రోవంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అంధేరి-కుర్లా రహదారిలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాలను సహాయ సిబ్బంది తొలగిస్తోంది.