మేం ఎవరిపై దాడి చేయలేదు

` అసలు కలెక్టర్‌ మా గ్రామానికి వస్తున్న విషయమే మాకు తెలియదు
` మీడియా ఎందుట లగచర్ల గ్రామస్థులు
` ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు
` దాడి కారుకుడు సురేశ్‌కు భూమే లేదు
` ప్రభుత్వానికి నివేదించిన కలెక్టర్‌
హైదరారాబాద్‌(జనంసాక్షి)లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్‌ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్‌ కలెక్టర్‌ తేల్చారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌, అతని సోదరుడు మహేష్‌కు ఎలాంటి భూమి లేదని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న 42 మంది నిందితుల్లో 19 మందికి భూమి లేదని కలెక్టర్‌ గుర్తించి, తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడి ఘటనలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి సహా 16మందిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఇదిలావుంటే తెలంగాణలో వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు తిరగబడి దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన వెనక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తోన్న ప్రభుత్వం లగచర్ల ఘటనను సీరియస్గా తీసుకుని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. లగచర్ల ఘటనలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేత, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించగా.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేరు కూడా ఈ ఘటనలో తెరపైకి వచ్చింది. ఈ పరిమాణాల నేపథ్యంలో లగచర్ల గ్రామంలో రాష్ట్రంలో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లగచర్ల గ్రామస్తులు విూడియా ముందుకు వచ్చారు. లగచర్ల గ్రామ ప్రజలు హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో విూడియాతో మాట్లాడారు. ‘మా గ్రామానికి ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం చేశారు. ఫార్మా కంపెనీ పెడితే మా భూములు కోల్పోతాం. మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మాకు ఫార్మా కంపెనీ వద్దు. ఫార్మా కంపెనీ వలన మాకు రోగాలు వస్తాయని అన్నారు. అసలు కలెక్టర్‌ మా ఊరికి వస్తున్నాడని మాకు తెలియదు. మేము ఎవరిపై దాడులు చెయ్యలేదు. మాపై, మా కుటుంబాలపై దాడులు చేశారు. పోలీసులు మా కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేశారు. వాళ్లను వెంటనే విడుదల చెయ్యాలి. మాకు ఏం జరిగిన ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని అన్నారు. లగచర్ల ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న వేళ ఏకంగా.. ఆ గ్రామ ప్రజలకు విూడియా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఫార్మా భూమి అని చెప్పి ..ఫోర్ట్‌ సిటీ కోసం యత్నం:కేటీఆర్‌
తెలంగాణ హైకోర్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల ధరలు తగ్గాయని చెప్పారు. కాంగ్రెస్‌ మిగతా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. లగచర్లలో ఉంది ఫార్మా భూమి అని హైకోర్టు కోర్ట్‌కు సీఎం రేవంత్‌ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బయటకు వచ్చి ఫోర్త్‌ సిటీ అంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు.తెలంగాణ భవన్‌లో గురువారంవిూడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్‌కు లగచర్ల భూసేకరణ గిరిజన కుటుంబాలు చేరుకున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉంటానని కేటీఆర్‌ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి సీట్‌ కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ విమర్శలు చేశారు.నల్గొండ ,ఖమ్మం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క సీఎం చైర్‌ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ముందుగా తన సీట్‌ పోకుండా రేవంత్‌ రెడ్డి చూసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భూముల ధరలు పెరిగాయని అన్నారు. ఏమైనా అభివృద్ధి చేస్తారేమోనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ‘లగుచర్ల ఇష్యూతో సర్కారు బంగపడిరది. లగచర్లలో అరెస్టు అయిన వారిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వదిలి పెట్టి బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేశారు . పోలీసులు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మా నాయకుడు సురేష్‌ తప్పేం చేశారు. నరేందర్‌ రెడ్డినీ ఎందుకు అరెస్టు చేశారు. నాలుగేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం. ఆంధ్రలో ఏం జరిగిందో తెలంగాణలో అదే జరుగుతది. బీఆర్‌ఎస్‌ నేతలపై బోగస్‌ కేసులు పెడుతున్నారు. అధికారులకు అంత స్వామి భక్తి పనికి రాదు. రేవంత్‌ పిచ్చోడు.. అసలు వదలం. బాధితులను ఢల్లీికి తీసుకెళ్తాం. నేషనల్‌ హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేస్తాం అని కేటీఆర్‌ హెచ్చరించారు.

‘ఏదో ఒక కేసులో ఇరికించి నా అరెస్టుకు కుట్ర
` అవిషయం నాకెప్పుడో తెలుసు
` ప్రభుత్వ కుట్రలకు ఎవరూ భయపడరు: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి) ‘ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రైతుల గొంతుకైనందుకు అరెస్ట్‌ చేస్తే గర్వంగా జైలు కెళ్తానన్నారు. ‘కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్‌ చేస్కో రేవంత్‌రెడ్డి’ అని సవాల్‌ విసిరారు.’’ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికొట్టడం కుట్ర కాదా?9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా?మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు.’’ అని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఉందని.. అందుకే తనను టార్గెట్‌ చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.విూడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లగచర్ల భూ సేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. ఘటన జరిగినప్పుడు అక్కడ లేని భారాస కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ఆరోపించారు. సురేశ్‌ అనే వ్యక్తి భారాస కార్యకర్తే.. ఆయనకు భూమి ఉందని తెలిపారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్‌, పోలీసుల వైఫల్యం ఉందని వ్యాఖ్యానించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌కు వెళ్లినట్టు వెళ్లారని మండిపడ్డారు.ఫోర్త్‌ సిటీ, ఏఐ సిటీ అని రేవంత్‌ రెడ్డి మాటలు చెబుతున్నారు.. కానీ అవి సాధ్యం కాదన్నారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ ద్వారా అమృతం వస్తుందా? అని ప్రశ్నించిన ఆయన.. ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదన్నారు. తాము సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా? అని నిలదీశారు. ప్రాజెక్టులు, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలని… ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు హరీశ్‌రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా అని కేటీఆర్‌ అన్నారు. వీళ్లకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావటం లేదని వ్యాఖ్యానించారు.