మొక్కలు నాటి సంఘీభావం తెలుపుదాం

హరిత తెలంగాణకు నాంది వేద్దాం
సిద్దిపేట,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పిలుపు మేరకు సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితతెలంగాణకు పాటుపడాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సూచించారు. ఇందుకు ప్రతి టిఆర్‌ఎస్‌ కార్యకర్త ముందుకు రావాలన్నారు. తన నియోజకవర్గంలో ముందుగా పనులు చేస్తామని అన్నారు. ఇంటింటికీ కనీసం ఐదు మొక్కలను నాటి హరిత తెలంగాణను సాధించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అటవీ శాతాన్ని పెంచే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇంటింటికీ మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది,సంఓఏమ కార్యమ్రాలకు కృతజ్ఞతగా అంతా మొక్కలునాటి సంఘీబావం ప్రకటించాలన్నారు. గతంలో అడువులను నరుక్కుపోతున్నా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు కఠిన ఆంక్షలతో అడవులకు రక్షణ కల్పించారని అన్నారు.ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రతి గ్రామంలో హరితహారాన్ని నిర్వహించాలన్నారు. ఇప్పటికే  హరితహారం కోట్లాది మొక్కలు నాటి అందరి ప్రసంశలు పొందిందన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల  దృష్టి అంతా తెలంగాణపై ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనకు పట్టంగట్టిన ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని పత్తాకు లేకుండా చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజా పార్టీ అని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

తాజావార్తలు