మొదలైన ప్రలోభాలు ….గంటల సమయంలోనే ఎన్నికలు

రేగోడ్// జనం సాక్షి:-
అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనెల 28 తేదీన ప్రచారం ముగిసినరేగోడ్ మండలంలో మాత్రం నాయకుల ప్రచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కండువాలు లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు, మద్యం, డబ్బును ,ఎరవేస్తూ కొందరు పార్టీల నేతలా “” అనుచరులు, నాయకులు వివిధ పార్టీల గుర్తులు చూపుతూ తమకే ఓటేయాలని ఓటు గుర్తు అభ్యర్థిస్తున్నారు, ఎలాగైనా కొందరు ఓటర్లను లొంగించుకోవాలన్నా ఉద్దేశంతో మండలంలోని పలు గ్రామాలలో రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నారు. ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ప్రలోభాల పనులు కొందరు నాయకులు బిజీగా ఉన్నారు ఏది ఏమైనా డబ్బు మద్యం మాత్రం విచ్చలవిడిగా గ్రామాలలో చేరుకున్నట్లు సమాచారం