మొలంగూర్ లో అధిక ధరలకు ఫిట్టి సైడ్స్ విక్రయాలు
…
మహాసభలో బయటపెట్టిన మాజీ వైస్ చైర్మన్..
చర్యలు తీసుకుంటున్న హామీ ఇచ్చిన చైర్మన్…
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 24
కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో అధిక ధరలకు పెటిసైడ్స్ విక్రయిస్తున్నారని, మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం మాజీ చైర్మన్ కాల్వ మహేందర్ రెడ్డి మహాసభలో బయటపెట్టారు. సహకార సంఘం చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి స్పందించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. శుక్రవారం మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ 2022/2023 మహాసభ అధ్యక్షుడు పొద్దుటూరు సంజీవరెడ్డి అధ్యక్షతన సంఘం సీఈవో సదయ్య నిర్వహించారు. మహాసభలో సిఈఓ సదయ్య సంఘం లావాదేవీలను సభ్యులకు చదివి వినిపించారు. మహాసభకు హాజరైన మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ కాల్వ మహేందర్ రెడ్డి, రైతులు సంఘం ఆధ్వర్యంలో విక్రయాలు కొనసాగిస్తున్న ఎరువులు, పెట్టి సైడ్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 11 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 1 బస్తాకు 6 కిలోల వరకు రైస్ మిల్లర్లు కటింగ్ చేసుకుంటున్నారని సమావేశంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించడం లేదని ఇప్పటికైనా రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని కోరారు. స్పందించిన చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ సంఘం నియామ నిబంధనల మేరకు పెట్టి సైడ్స్ విక్రయించిన సేల్స్ మేన్ లపై సంఘ పరంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఖాతాదారులు రైతులు తమ వంతు కృషిని అందించి సంఘం ఆధ్వర్యంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంగం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చైర్మన్ సంజీవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కన్నాపూర్ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, సంఘం ఉపా అధ్యక్షుడు అంతం రవీందర్ రెడ్డి, సభ్యులు బోనగిరి ఐలయ్య, కాటం బుచ్చిరెడ్డి, కాల్వ వెంకట రమణారెడ్డి , బత్తుల రవి, కవ్వ పద్మ, బోడ సుధాకర్, రాజిరెడ్డి, అసిస్టెంట్ సీఈవో గాజుల సంపత్ క్లర్క్ నూనె రవీందర్, వేముల శ్రీనివాస్ గోదాo ఇన్చార్జిలు, రాజు , చంద్రారెడ్డి, అటెండర్ నిజాముద్దీన్ , రైతులు, ఖాతాదారులు,తదితరులు పాల్గొన్నారు.