మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.