మోహన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు

కర్నూలు: తెదేపా నేత మోహన్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో మోహన్‌రెడ్డి స్వస్థలంలో ఈ రోజు అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలియజేశారు.