యాజమాన్య నిర్లక్ష్య ధోరణితో కార్మికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: తమ వేతనాల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీ సీసీఎస్‌కు వెంటనే పంపించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌ వ్యక్తం చేసింది. యాజమాన్య  నిర్లక్ష్య ధోరణితో 13 వేల మంది కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని యూనియన్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఈ నెల 10 వతేదీలోగా పరిష్కరించాలని ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులిచ్చామని గుర్తు చేశారు. కార్మికులు, కార్మిక నేతలపై వేధింపులు అరికట్టాలని, అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ఎంప్లాయిన్‌ నేతలపై అధికారులు వివక్ష ప్రదర్శిస్తూ వేధింపులకు గురిచేయడం సాధారణమైందని ఆరోపించారు. మరో మూడు రోజుల్లో యాజమాన్యం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 13వ తేదీనుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నేతలు హెచ్చరించారు.