యాదగిరిరావు అరెస్టుపై ఏసీబీ ప్రకటన

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో మధ్యవర్తి యాదగిరిరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. యాదగిరిరావు ఇంటినుంచి రూ.3.75కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ తెలిపారు. గాలి సోదరుడు సోమశేఖర్‌ రెండ్డి నుంచి రూ.9.5కోట్లు యాదగిరి తీసుకున్నాడని, బెయిల్‌ మంజూరైన రోడు రాత్రి రూ.3కోట్లు విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావుకు చెల్లించాడని ఏసీబీ డీజీ పేర్కొన్నారు. సోమశేఖర్‌రెడ్డి ఇచ్చిన డబ్బు నుంచి యాదగిరిరావు ఒక మారుతి స్విఫ్ట్‌ కారు కొనుగోలు చేసినట్లు, రూ.60లక్షలతో నాచారంలో రెండు ఇంటి స్థలాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ తెలిపారు.