యూపీలో ప్రణబ్‌ముఖర్జీకి భారీగా స్వాగత ఏర్పాట్లు

లక్నో: రాష్ట్రపతి అభ్యర్థిగా లక్నో వెళ్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి బ్రహ్మండమైన స్వాగతం చెప్పడానికి అఖిలేశ్‌ ప్రభుత్వం భారీ సన్నాహలు చేసింది.ప్రణబ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఒకరోజంతా గడపనున్న దృష్ట్యా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌విందు ఏర్పాట్లు చేశారు.యూపీలో ప్రణబ్‌ ములాయం సింగ్‌తో భేటీ కానున్నారు.యూపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ, ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లు చూసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేశారు.ఆయనకు స్వాగతం చెప్పడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం చేరుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వవలసిందిగా కోరుతూ ప్రణబ్‌ చేస్తున్న పర్యటనల్లో చెన్నై హైదరాబాద్‌ తర్వాత మూడోది లక్నో