యోగా గురువు బాబా రాందేవ్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిపై తన డిమాండ్లను నెరవేర్చాలని దీక్షకు దిగిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ అరెస్టు అయ్యారు. పార్లమెంట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న బాబాను రంజిత్‌ ఫై ఓవర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు బాబా మీడియాతో మాట్లాడారు. నల్లధనంపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర వెనుకంజ వేస్తోందని బాబా ఆరోపించారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. అనంతరం బాబాను పోలీసులు అరెస్టు చేశారు. రంజిత్‌ ఫ్లై ఓవర్‌ పరిసర ప్రాంతాలు బాబా అనుచరులతో జనసంద్రంగా మారిపోయింది. భారీగా పోలీసులను మోహరించారు.