యోగా గురువుకి సన్మానం

హుజూరాబాద్‌ (జనంసాక్షి): హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్‌ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య మాట్లాడుతు బుచ్చినాయుడు వృత్తి రిత్యా పోలీస్‌కానీస్టేబుల్‌ అయినప్పటికి గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది వృద్దులకు యోగా సాధన చేయిస్తున్నాడని అన్నారు. యోగా వలన వయోవృద్దులు ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య లనుంచి విముక్తి పొందుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్‌, తాళ్ల పల్లి శ్రీనివాస్‌, చౌడమల్ల రంగయ్య, రమేష్‌, కిషోర్‌, కొత్తూరి రమేష్‌, చలపతిరావు, పీఈటీ మట్టారెడ్డి తదితరులున్నారు.