రంగారెడ్డి జిల్లాకు బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: జిల్లాలో రెండో రోజు ఇందిరమ్మ బాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాండూరుకు బయల్దేరి వెళ్లారు.  సీఎంతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లకాష్మరెడ్డి. శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. తాండూరులో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సాయంత్రం వికారాబాద్‌. పరిగిలలో సీఎం బహిరంగ సభలలో పాల్గొననున్నారు. బుధవారంతో జిల్లాలో ఇందిరమ్మ బాట ముగియనుంది.