రవళికి మంత్రి ఎర్రబెల్లి నివాళి
కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి
హైదరాబాద్,మార్చి5(జనంసాక్షి): ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన రవళి(20) మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. మంగళవారం ఆస్పత్రి మార్చురీలో రవళి శవపరీక్షలు పూర్తి చేశారు. గాంధీ ఆస్పత్రిలో రవళి బాధితురాలి కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెట్రోలు దాడి నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవళి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. రవళి చికిత్స నిమిత్తం ఆస్పత్రి ఖర్చంతా ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కోసం వరంగల్ పోలీసులు గాంధీ హాస్పిటల్‌కు వచ్చారు. రవళి ఆరోగ్యం మొదటి నుంచి విషమంగానే ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వమే అన్నిరకాల వైద్య ఖర్చులు భరించిందన్నారు. రవళి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. పెట్రోల్ దాడి నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.కుటుంబసభ్యులకు మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది అప్పగించడంతో వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు.