రవి కుటుంబంతో విభేదాలు లేవు
హైదరాబాద్: కొంతకాలంగా మౌనంగా ఉన్న పరిటాల రవి అనుచరుడు చమన్ తన భవిష్యత్ ప్రణాళిక గురించి నోరువిప్పారు. ఇప్పుడు తనకెవరూ ప్రత్యర్థులు లేరని త్వరలోనే అనంతపురం వెళ్లనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాతో అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతం లేకున్నా భవిష్యత్‌లో అనుచరులు, సన్నిహుతులు సుచించిన రాజకీయపార్టీలో చేరాలనుకున్నట్లు వెల్లడించారు. జగన్‌పార్టీలో చేరమని తన అనుచరులు ఎప్పటికీ చెప్పరని ఆయన అన్నారు. పరిటాల రవి కుటుంబంతో తనకెలాంటి విభేదాలు లేవని.. ఒక శ్రేయోభిలాషిగా వారి కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పానని చమ్ చెప్పారు.