రాజమండ్రిలో ప్రశాంతంగా పోలింగ్..

రాజమండ్రి : తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుండి ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థిగా చైతన్యరాజు, టిడిపిలో నుండి బయటకొచ్చిన కృష్ణా రావు, యూటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావులు బరిలో నిలిచారు. చైతన్య రాజు గెలుపును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయన గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు యూటీఎఫ్ అభ్యర్థి కూడా ధీటుగా ప్రచారం నిర్వహించారు. దీనితో ఎమ్మెల్సీగా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.