రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజాస్థాన్‌: రాజస్థాన్‌లో మంగళవారంఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాల్వర్‌ జిల్లా అక్‌లెరా వద్ద బాల్తాబకాని రహదారిపై జ్ఞాన్‌ విహార్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా బాల్తాలోని జ్ఞాన్‌ విహార్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులే. ఘటనలో గాయపడిన మిగిలిన విద్యార్థులను స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.