రాజ్యాంగబద్థ సంస్థలను కాంగ్రెస్‌ చులకన చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ తీరుపై భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కాంగ్రెస్‌ చులకన చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థలైన న్యాయవ్యవస్థతోపాటు విజిలెన్స్‌, ఎన్నికల కమిషన్‌, సీబీఐ, కాగ్‌లను భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. 2జీ, బొగ్గు కుంభకోణాలపై కాగ్‌ లెక్కలు తప్పుల తడకని స్వయంగా  ప్రధాని ప్రకటించడం యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రలో భాగమేనని వెంకయ్య అన్నారు.