రాయల తెలంగాణకు ఫ్రంట్‌ వ్యతిరేకం


తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌
నర్సంపేట, జూన్‌ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఆధ్వర్యంలో క్రొవ్వత్తులతో తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. ఈసందర్భంగా వేద కుమార్‌ మాట్లాడుతూ రాయల తెలంగాణ వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకు తీవ్ర అణ్యాయం జరుగుతుందన్నారు. నీల్లు, నిధులు, ఉద్యోగాలలో ఎంత మాత్రం న్యాయం జరగదన్నారు. రాయల తెలంగాణతో సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంద్రా పాలకులు కావాలనే రాయల తెలంగాణను తెరమీదికి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటు పట్ల రెండు ప్రధాన పార్టీలు నోరు మెదపడం లేదని విమర్షించారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, నల్లమాస కృష్ణ, అన్వర్‌ఖాన్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి, కళ, జనగం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.