రాయల తెలంగాణ…..ఓవిషపు వల..

చిరకాలము జరిగెను మోసం..బలవంతుల పన్నాగాలు బలహీనులను కాల్చుకు తినడం..ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఒక జాతి మరొక జాతిపై బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించెను. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఇది తెలంగాణ చరిత్రకు సరిగ్గా సరిపోయే నిజం..ఏలికలు తమ ప్రయోజనాల కొరకు, భాషాభిమానం, ప్రాంతీయాబిమాóనంతో ఇతర ప్రాంతాల ప్రజలను బానిసలు చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. సరిగ్గా అదే తెలంగాణ విషయంలోనూ జరిగింది..జరుగుతూనే ఉంది. కోస్తాంధ్రులు అందినకాడికి తెలంగాణను దోచారు. నీళ్లు,నిధులు,ఉద్యోగాలు న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా(టి)ల్లో ప్రతిదాంట్లోనూ అన్యాయమే జరిగింది. తెలంగాణకు బూడిదే మిగిలింది. రియల్‌ఎస్టేట్‌ పేరుతో హైద్రాబాద్‌ భూములను తన్నుకుపోయారు. మట్టిన నమ్ముకున్న తెలంగాణ వారి భూములలను అమ్ముకున్నారు. అది వారితో ఆగలేదు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన రాయల సీమోళ్లు తెల్లలుంగీలు,గళ్లచొక్కాలతో ఓచేత బాంబుల సంచి, మరో చేత కత్తుల కట్ట పట్టకుని వీరవిహారం చేస్తూ రాజధానిలో కబ్జాల పర్వానికి తెర లేపారు. సెటిల్‌మెంట్‌ల పేరుతో తమలోని కొత్త కోణాన్ని ప్రజలకు చూపారు. వైయస్‌ సీఎం అయ్యాక అది తారాస్థాయికి చేరింది. సెటిల్‌మెంట్‌ చేసేటోళ్లు లైసెన్స్‌డ్‌ గుండాలయ్యారు. అదే ప్రభుత్వానికి ఆదాయ వనరు అయ్యింది.రాజధాని శివారుల్లో కత్తులు పాతి భూములు యదేచ్ఛగా స్వాహా చేశారు. ఇక తెలంగాణ విడిపోతదని తెలిసే సమయాన రాయల తెలంగాణ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. ఏం సీమోళ్లు తెలంగాణ తల్లి గుండెలపై పెట్టిన కత్తి గాట్లను, బాంబుల మచ్చను, తెలంగాణ గుండెలపై వారి చేతిల్లోని తుపాకీలు చేసిన గుళ్ల గాయాలను ఏ ఒక్క తెలంగాణ బిడ్డ మర్చిపోలేడు. మర్చిపోయిన తెలంగాణ రాజకీయ నాయకులు కొందరు సీమ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ రాయల తెలంగాణకు వంత పాడుతున్నరు. మందలోని గొర్రెల్లా తలలూపుతున్నరు. ఈ నాడు ఏ ఒక్క తెలంగాణ పౌరుడు కూడా రాయలతెలంగాణకు మద్దతు ఇవ్వట్లేదు. హైద్రాబాద్‌తో సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నారు. స్వయంపాలన, ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఆకలి కేకల, వలసల జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ సాగు,త్రాగు నీటికి పెద్ద దిక్కు అయిన ఆర్‌డీఎస్‌ తూములను బాంబులతో పేల్చేసిన, పోతిరెడ్డిపాడుకు తెలంగాణ జలాలు తరలించుకుపోయిన సీమాంధ్రులతో మనకు స్నేహమెక్కడిది. రాయల తెలంగాణ అనేది తేనె పూసిన కత్తి. ఓ విషపు వల, ఆ ఉచ్చు ఊహల్లోకి వెళ్లడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరు. సమైక్యాంధ్ర పెనంలోంచి రాయల తెలంగాణ పొయ్యిలోకి పడడానికి తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమం చివరి దశకు చేరిన ఈ దశలో అమరవీరుల ఆశయాలను అపహాస్యం చేస్తూ సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగుతున్న తెలంగాణ ద్రోహుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే

మన అప్రమత్తత లోనే ఉంది తెలంగాణ ప్రజల భద్రత.