రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ దూరం

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రావుతో సహ ఆ పార్టీ ఓటింగ్‌కి దూరంగ ఉండాలను కుంటునట్టు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవటంలో విఫలమైందని అందువల్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి ఓటు వేయటం సరికాదని భావిస్తున్నారు. ప్రణబ్‌ముఖర్జీ కూడా తెలంగాణకు వ్యతిరేఖమని నాయకులు మండిపడుతున్నారు. యుపిఎ ప్రభుత్వం ఆగస్టులో తెలంగాణ రాష్రాన్ని ఇస్తుందని, సంకేతాలు అందుతున్నాయని కెేసిఆర్‌ కొంత కాలంగా చెప్పుకొస్తున్నారు.  ప్రణబ్‌ ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేసే ఉద్దేశంతో కెసీఆర్‌ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఎంపీ మధూయాష్కి మాత్రం కెసిఆర్‌ ప్రకటనలో ఎంత నిజం ఉందో తమకు తెలియదని అన్నారు. ప్రణబ్‌ముఖర్జీకి ఓటు వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలమైన నిర్ణయం రాకపోతే తీవ్రమైన విమర్శలకు గురికావాల్సీ ఉంటుందని కేసిఆర్‌ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఓటింగ్‌కు దూరంగా ఉండటమే మంచిదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉందని అయితే వచ్చేవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. తెరాసకు ప్రసుత్తం 17మంది శాసన సభ్యులు, అనుబంధ శాసన సభ్యుడు, ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు -కెేసిఆర్‌,విజయశాంతి ఉన్నారు.