రాష్ట్రపతి సాక్షిగా జై తెలంగాణ

నోరుమూసి అమానవీయంగా బయటకు ఈడ్చుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సాక్షిగా జై తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేశాడు వరంగల్‌ హైదరాబాదీ వైద్యుడు. గురువారం నగరంలోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆసియా-ఫసిపిక్‌ నేత్ర వైద్య సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ప్రారంభించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సదస్సులో మాట్లాడుతుండగా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి జై తెలంగాణ నినాదాలు చేశాడు. 110 దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో నరేందర్‌రెడ్డి నాలుగున్నర కోట్ల ఆంకాక్షను చాటిచెప్పారు. దీంతో వేదికపై ఉన్న రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం అవాక్కయ్యారు. పోలీసులు నరేందర్‌రెడ్డి పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆయనను బటయకు ఈడ్చుకెళ్లి దాడికి తెగబడ్డారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.