రాష్ట్రమంతటా భద్రత కట్టుదిట్టం

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా బలగాలను మోహరించారు. కడపలో ప్రతి నియోజకవర్గంలో పారామిలటరీ బలగాలను మోహరించినట్లు సమాచారం. పలు జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. కరీంనగర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏడుగురు కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కోదాడ, సూర్యాపేటలో భారీగా పోలీసులను మోహరించారు.