రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు
ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 95 బస్ డిపోలతోపాటు ఉప్పల్, మియాపూర్, కరీంనగర్ లోని మూడు వర్క్ షాపులు, బస్ భవన్ లో పనిచేస్తున్న వారికోసం మొత్తం 114 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. 800 మందిని ఈ ఎన్నికల విధుల కోసం నియమించారు. మొత్తం 52,848 మంది ఆర్టీసీ సిబ్బంది ఈ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదయ్యారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనున్నది. 9 నుంచి 11 గంటల మధ్య అనధికారికంగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. అటు వచ్చేనెల 6న అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తారు.