రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళ

హైదరాబాద్‌: తన రెండేళ్ల కొడుకు భవిష్యత్తుకు న్యాయం చేయాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని చెన్నైకి చెందిన ఎన్నారై భార్య యామిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. హైదరాబాద్‌ కవాడిగూడలోని భర్త ఇంటిముందు దీక్ష చేస్తున్న తనను పోలీసులు అక్కడినుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను అత్తింటివారితో గొడవకు రాలేదని, తన కొడుకు భవిష్యత్తుకూ న్యాయపోరాటం చేస్తున్నానని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన కమిషన్‌ వచ్చే నెల 24 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చిక్కడపల్లి ఏసీపీకి ఆదేశాలు జారీచేసింది.