రూల్స్ పాటించిన ట్రాఫిక్ పోలీస్
నిబంధనలు పాటించని పోలీసులకు చలాన్లు
హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): రూల్స్ అన్నప్పుడు అందరకీ ఒకటే అని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. నిబంధనలు పాటించని పోలీసులకు చలాన్లు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలునడుపడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినవారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్. ఆగస్టు 21న రాంగ్ రూట్ లో వెళ్లిన పోలీసు జీపును గుర్తించినట్లు, ఈ ఏడాది రూల్స్ పాటించని 50 మంది పోలీసులకు చలాన్లు విధించామన్నారు. నిబంధనలు పాటించని పోలీసుల ఫొటోలు, వీడియోలు సోషల్ విూడియాలో పెట్టవద్దని సూచించారు. కొంతమంది పాత వీడియోలను మళ్లీ పోస్ట్ చేస్తున్నారని, దీని వల్ల పోలీసుల ప్రతిష్ఠ దిగజారుతుందని సీరియస్ అయ్యారు. ఇలా అనవసర పోస్టులు పెట్టడం వల్ల టైమ్ వేస్ట్ చేసుకోవడమేనని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు.



