రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. త్వరితగతిన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆయన ఆదేశాలు జారీచేశారు. గత పదేళ్లలో ఈ శాఖపై సీఎం స్థాయిలో సమీక్ష జరపడం ఇదే ప్రధమం. జిల్లా స్థాయిలో సమాచారం శాఖను బలోపేతం చేసేందుకు ఆధునికీకరణ పనులు చేపడతామని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు.ఖాళీగా ఉన్న ప్రచార సహాయకుల పోస్టులు భర్తీచేస్తామని ఆమె తెలిపారు.