రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో విద్యుత్‌ శాఖపై సంబంధిత అధికారులతోసమీక్ష సమావేశం నిర్వ హించారు.విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మరమ్మత్తులు లోవోల్టేజి సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల అక్రమాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌తో పాటు రైతులు మంత్రి దృష్టికి తీసుకోవచ్చారు. ఈ ఫిర్యాదుల నేప థ్యంలో మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా పెద్ద ఎత్తున సబ్సిడీలు అంది స్తున్నామని, 5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. రైతును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవడంతో పాటు పంటలను నష్టపోతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో ఓవర్‌లోడ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకో వాలని, కొత్త కనెక్షన్లకై దరఖాస్తులు చేసిన రైతులందరికి వీలైనంత తొందరలో వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు మంజూరు చేయాలని సియండికి సూచించారు. విద్యుత్‌ శాఖపై ప్రజలకు మంచి అభిప్రాయం లేదని, ఫిర్యాదులు రాకుండా, ప్రజలకు ఇబ్బందులకు గురి చేయకుండా అధికారులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో మంది రైతు కుటుంబాలు జీవితాలు మీ యొక్క విధులపైన ఆధారపడి ఉన్నాయని, సరైన పద్దతిలో విద్యుత్‌ను అందించినప్పుడే పంట నష్టం జరుగకుండా ఉంటుందన్నారు. ప్రజలు, రైతులపై పెనాల్టీ వేసి అధికారం మీకు ఉన్నప్పుడు మీ అశ్రద్ద వల్ల పంటలు ఎండిపోతే మీపైన ఎందుకు పెనాల్టీ వేయకూడదని ప్రశ్నించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌మాట్లాడుతూ గత సంవత్సరం రబీలోను ఈ సంవత్సరం రబీలోను వ్యవసాయ బావులకు రెండు గంటలు అదనంగా విద్యుత్‌ సరఫరా చేసినందువల్ల 350 గ్రామాల్లోని పంటలను కాపాడుకోగలిగామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 24 గంటలు విద్యుత్‌ అందించినందున నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నామనిసియండికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో 50శాతం పైగానే రైతులు విద్యుత్‌ సరఫరాపై ఆదారపడ్డారని, పెండింగ్‌లో ఉన్న 3700 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రైతులు డిడి కట్టిప్పటికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకపోవడం వలన పర్యటనల్లో, పలు కార్యక్రమాల్లో రైతులు తమ ఇబ్బందులను తెలుపుకుంటున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని కనెక్షన్లు ఒకేసారి మంజూరు చేస్తే రైతులు హర్షిస్తారని తెలి పారు. విద్యుత్‌ శాఖ నుంచి రైతులు, ప్రజలు మరింత మెరుగైన సేవలను ఆశిస్తున్నారని, ఎక్కువ ఆశలను పెట్టుకున్నారని, ఆ దిశగా వ్యక్తిగత శ్రద్ద చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సియండి నర్సింహారెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి సబ్‌ స్టేషన్‌కు సంబంధించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియమకాలకు సంబంధించిన ఏజెన్సీలను నియమిస్తామని, అయితే ఈవిషయాల్లో వారు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఎంప్లాయింట్‌ ఎక్సేంజ్‌ల ద్వారా నియమించుకోవడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఆర్థిక అక్రమాలకు పాల్పడే అధికారులపై రైతులను ఇతర ఇబ్బందులకు గురిచేసే అధికారులపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మత్తులకు వస్తే పూర్తిగా ఖర్చును విద్యుత్‌ శాఖయే భరిస్తుందని, ఎవ్వరికి కూడ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఇ అశోక ్‌కుమార్‌, ఎస్‌ఇ రామకృష్ణ, విద్యుత్‌ శాఖకు సంబంధించిన పలు హో దాలలో గల అధికారులు, ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.