రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు
హైదరాబాద్: జనవరి 21 నుంచి 28 మధ్య రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి తెలియజేశారు. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై అధికారులతో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి నేడు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 14లోపు సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.



