రెండో రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట ప్రారంభమైంది. ఆయా జిల్లాల టీఆర్‌ఎస్ నేతలు పల్లెబాట కార్యక్రమాలను ప్రారంభించారు. నేతలు కార్యకర్తలతో కలిసి హుషారుగా పల్లెబాటలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలకు గ్రామాల్లో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. పల్లెలో ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగుతున్నాయి. సీమాంధ్ర పార్టీలకు ఘోరీ కడతామని ప్రజలు తేల్చిచెబుతున్నారు. ఇక తెలంగాణ సాధించుకోవాలని పల్లెలు ఏకమవుతున్నాయి. టీఆర్‌ఎస్ జెండాలు చేతబూని యువకులు పరుగులు తీస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ నేతలు వివరిస్తున్నారు. తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు.



