రేపు ఎమ్మెల్యే పదవికి యడ్డీ రాజీనామా

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బీజేపీ నుంచి తప్పుకోనున్నారు. ఎంతో కాలంగా పార్టీని వీడుతానని ఊరిస్తున్న యడ్డీ ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 30న ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని యడ్డీ ప్రకటించారు. డిసెంబర్‌ 10న కొత్త పార్టీ నెలకొల్పుతానని గతంలో యడ్డీ ప్రకటించిన విషయం తెలిసిందే. తన వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెప్పారు.