రేపు విజయవాడ మహధర్నాలో పాల్గొననున్న చంద్రబాబు

విజయవాడ:విజయవాడలో దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం చేపట్టనున్న మహదర్నాలో ఆపార్టీ చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.తొమ్మిది,ఐదు జాతీయ రహదారులు బెజవాడ మద్య నుంచి వెళ్లున్నాయి.క్రమంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపాతోపాటు వివిద పక్షాలు కొన్నేళ్లుగా ఆందోళన నిర్వహిస్తున్నాయి.వంతెన నిర్మిస్తామని అధికారపక్షం ఎప్పటి కప్పడు హమీ ఇస్తూ వస్తొంది.అయితే అది ఇంతవరకు సాకారం కాలేదు.ఈ నేపధ్యంలో తెదేపా నిర్వహించే మహధర్నాలో చంద్రబాబునాయుడు పాల్గొంటున్నారు.