రేపు విద్యుత్‌ సౌధ ముట్టడి-టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌: కరెంట్‌ సరఫరా విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేెందర్‌ పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, సబ్‌స్టేషన్లను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు ముట్టడించాలని పిలుపునిచ్చారు. రౖౖెతుల పొలాలు ఎండిపోతుంటే సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహిరిస్తున్నారని విమర్శించారు. గ్రామాలు అందకారంగా మారుతున్నాయని ఈవేదన వ్యక్తం చేశారు.రైతులకు 7గంటలు విద్యుత్‌ ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.