రేపు సింగరేణి లయన్స్‌క్లబ్‌ ప్రమాణస్వీకారం

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి లయన్స్‌క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆగస్టు 1న సాయంత్రం స్థానిక పద్మశాలి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రొగ్రాం చైర్మన్‌ ఎం.బద్రీనాథ్‌, కోచైర్మన్‌ వి.చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ మాజీ గవర్నర్‌ పొకల చందర్‌ చేత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం స్వీకారం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి డీఎస్పీ ఎం.రవిందర్‌రెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్‌ గడ్డం జగన్నాథం, రీజియన్‌ చైర్మన్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు.