రేవ్‌పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్‌: నగర శివార్లలో జరుగుతున్న రేవ్‌ పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్లీల కార్యక్రమాలు యధేచ్చగా .జరిగిపొతున్నా యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండల శివార్లలోని ఓ ప్రైవేటు రిసార్టులో జరిగిర రేవ్‌పార్టీపై మీడియాలో వచ్చిన కధనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దానిపై విచారణ చేపటింది. రెండు వారాలోగా వివరణ ఇస్తూ కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాలోగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి అవకాశమిస్తూ విచారణను వాయిదా వేసింది. కోర్టు సుమోటోగా స్వీకరించిన ఈ పిటిషన్‌లో ప్రభుత్వంతో  పాటు డీజీపీని, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది.