రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  పిఎసిఎస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లబిస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లోనరా దాన్యం విక్రయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విజయనాగేశ్వరరావు, రాజు నాయక్, డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, బానోతు సమ్మక్క, కిషన్ నాయక్, పొట్ల రాజమ్మ రైతులు, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు