*రైతులే దేశానికి వెన్నెముక్క…..జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*

*ఏజెన్సీ రైతులకు పత్తి పంట మీద MCX సొసైటీ రైతుమిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, ఐటిడిఎ ఛైర్మన్ కనక లక్కెరవ్*

ఉట్నూర్ స్టార్ ఫంక్షన్ హాల్లో MCX సొసైటీ రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు రైతులకు పత్తి పంట గురించి అవగాహన సదస్సు కార్యక్రమంలో *ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు ఐటిడిఎ ఛైర్మన్ కనక లక్కెరవ్* గారితో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పండించిన పంటను రైతులకు గిట్టుబాటు ధర వచ్చుటకు మా వంతు కృషి చేస్తామన్నారు, రైతులే దేశానికి వెన్నెముక్క, ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన పంట పత్తి  అని అన్నారు.రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అన్ని విధాలుగా సహాయపడుతున్నారన్నారు.రైతులకు అనేక సంక్షేమ పథకాలు ఖరీఫ్ మరియు రబి సీసన్ లో ఎకరానికి 5 వేల రూపాయలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు  రైతు బంధు , రైతు బీమా (చనిపోయిన రైతులకు 5 లక్షల రూపాయలు ) ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. అనంతరం ముంబై నుంచి వచ్చిన శాస్త్ర వేత్త అయిన భద్రుదిన్ ఖాన్ గారు రైతులకు  మరింత సుదీర్ఘంగా రైతులకు పత్తి పంట గురించి మరియు ఫైనాన్సియల్ కమోడిటీ మార్కెట్ గురించి  ప్రెసెంటషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయ్ సెంటర్ సార్మెడి దుర్గు పటేల్ , ఉప మెడి తులసి రామ్ పటేల్ , శాస్త్ర వేత్త భద్రుదిన్ ఖాన్ , CCD ప్రాజెక్ట్ మేనేజర్ విట్ఠల్ రావ్ ,లక్కారం మాజీ సర్పంచ్   జీవ వైవిధ్య కమిటీ సభ్యులు మరసుకొల తిరుపతి, సీసీ దేవ్ రావ్,సిడం మదన్, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.