రైతుల పాదయాత్ర

 

తలమడుగు : మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతుల పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ. 6000 చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ రైతు సంఘం అధ్వర్యంలో 30 కి. మీ పాదయాత్ర చేపట్టారు. రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పాదయాత్రలో పాల్గోని మద్దతు తెలిపారు.