రైతుల సంక్షేమం కోసమే పిఎసిఎస్ గోదాం నిర్మాణం..
– భూమిపూజ చేసిన పలువురు ప్రజా ప్రతినిధులు.
– పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి):
రైతుల సంక్షేమం కోసమే ఊరుకొండ మండల కేంద్రంలో పిఎసిఎస్ గోదాము నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రాచాలపల్లి గేట్ సమీపంలో గల సర్వేనెంబర్ 221/E/1/1/1 లో 1985 సంవత్సరంలో అప్పటి పిఎసిఎస్ ఉన్నతాధికారులు రైతుల సంక్షేమం కోసం కొనుగోలు చేసిన 10 గుంటల భూమిలో ప్రభుత్వం నుండి మంజూరైన కోటి రూపాయల విలువ చేసే పిఎసిఎస్ గోదాం నిర్మాణానికి పిఎసిఎస్ చైర్మన్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి, గంగాపురం గోపాల్ రెడ్డి, సర్పంచులు కొమ్ము రాజయ్య,
ఆంజనేయులు, వీరెడ్డి పర్వత రెడ్డి, సీఈఓ వెంకట్ రెడ్డి,
పిఎసిఎస్ డైరెక్టర్లు వెంకటయ్య, ఫరీద్, ఉప సర్పంచ్ లు నారాయణ, పరశురాములు, మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు. సీనియర్ నాయకులు సుజీవన్ రెడ్డి, గిరి నాయక్, బక్క జంగయ్య, బచ్చలకూర రమేష్, కొమ్ము శ్రీను, కిట్టు, వెంకటయ్య, అమరేశ్వర్ రెడ్డి, గోపి, మల్లేష్, సందీప్ కుమార్, మనోహర్, బండి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.