రైలు దుర్ఘటన దురదృష్టకరం -హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: నెల్లూర్‌లో జరిగిన రైలు దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఉదయం జరిగిన నెల్లూరు రైలు ప్రమాదం ఘటనపై స్పందించిన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి అక్కడే ఉండి మృతదేహాలను గుర్తించే పనిని పర్యవేక్షిస్తునట్లు ఆమె తెలిపారు.