రైల్వే ఛార్టీల పెంపు అనివార్యం: రాఘవయ్య
హైదరాబాద్: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైల్వే ఛార్జీల పెంపు అనివార్యం కాబోతోందని దక్షిణ భారత రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవయ్య స్పష్టం చేశారు. వనరుల కల్పనే ముఖ్యోద్దేశంగా ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే మహిళా ఉద్యోగుల భద్రతపై జరిగిన సదస్సులో ఆయన పాల్గోన్నారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల నిర్మాణం, అదనపు సౌకర్యాల కల్పనకు రైల్వే ఛార్జీల పెంపు తప్ప నిసరైందని ఆయన తెలియజేశారు. మరోవైపు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేస్తూ, మహిళా ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయని రాఘవయ్య తెలియజేశారు.



