రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది

రైల్వే ఫైఓవర్‌ జాప్యం పై హెచ్‌.ఆర్‌.సిని ఆశ్రయించిన న్యాయవాది
హైదరాబాద్‌: కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ మధ్య రైల్వే ఫైఓవర్‌ నిర్మణం జాప్యం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.ఈ ఫైఓవర్‌ నిర్మాణం అలస్యంగా అవ్వడం వల్ల గత కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆజాద్‌ కమిషన్‌కు వివరించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులను ఆదేశించాలనికోరారు. దీని పై స్పందిచిన హెచ్‌.ఆర్‌.సి సెప్టెంబర్‌ 10లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, సి.ఎం.డి.ఎ అధికారులను ఆదేశించింది.